ఏ భాషా చిత్రాలు హిట్ అయినా వాటి హక్కులను కొనుగోలు చేయడంలో ఇతర భాషా చిత్రాల వాళ్ళు పోటీ పడుతున్నారు. ఆ చిత్రాలను రీ మేక్ చేయడం లేదా డబ్బింగ్ చేయడం లేక కొన్న హక్కలను మళ్ళీ ఇతరులకు అమ్మడం లాంటి బిజినెస్ లు కూడా నడుస్తున్నాయి. సినిమాలకు కొత్త కథలు ఎంచుకోవడం కన్నా ఇది చాలా తేలికనుకుంటున్నారు ఒక వర్గం సినిమా వాళ్ళు. కానీ కిక్ 2 సినిమాను మాత్రం ఇంకా విడుదల కాకుండానే సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ లోకి రీ మేక్ చేసేందుకు సిద్ధమై పోయారు. ఎందుకంటే ఇంతకు ముందు సల్మాన్ తెలుగులో నుంచి హిందీలోకి రీమేక్ చేసిన కిక్, పోకిరీ లాంటి రీ మేక్ చిత్రాలుబాక్సాఫీస్ హిట్ కావడమే. అయితే కిక్ 2 సినిమాను రీ మేక్ చేస్తున్న వార్తను సల్మాన్ కూడా కన్ఫం చేశారు. ఇందులో డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందట. కిక్ చిత్రానికి పని చేసిన దర్శకుడు సాజిద్ నడియా వాలా ఈ సినిమాకు కూడా డైరెక్షన్ బాధ్యతలు చేపడుతున్నాడు. గతంలో తాను చేసిన పోకిరి, రెడీ, కిక్ రీ మేక్స్ హిట్టవడంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతుందని తెలిపాడు. మరో వైపు ఈ వార్తలను సాజిద్ కూడా ధ్రువీకరించాడు. రెండు మూడు నెలల్లో కథ సిద్ధం అవుతుందని చెప్పాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా రవి తేజ హీరోగా చేస్తున్న కిక్ 2 తెలుగులో విడుదలకు రెడీ అవుతోంది.