రవి తేజ కిక్ 2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బెంగాల్ టైగర్ సినిమాకు కమిట్ అయ్యాడు. కిక్ 2 డిజాస్టర్ తో ఈ సినిమా అయినా హిట్ కావాలని చాలా కేర్ ఫుల్ గా చేస్తున్నాడు రవి తేజా. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఇది ఛాలెంజింగ్ చేస్తున్న సినిమా. సంపత్ నంది పవన్ కళ్యాణ్ తో (గబ్బర్ సింగ్ 2) సినిమా చేసే ఛాన్స్ ను లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాడు. అతను చేసే రెండో సినిమా ఇది. అయినా సరే ఎలాగైనా హిట్ చేయాలనే కసితో ఉన్నాడు సంపత్ నంది. సంపత్ రచ్చ హీరోయిన్ తమన్నా ఈ సినిమాకు కూడా రవి తేజతో జతకడుతోంది. మరో హీరోయిన్ రాశిఖన్నా కూడా నటిస్తోంది.
ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలన్న పట్టుదలతో సంపత్ నంది షూటింగ్ చాలా వేగవంతం చేశాడు. అయితే ఈ సినిమా ఆడియో తోపాటు థ్రియాట్రికల్ ట్రైలర్ ను ఈ ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తొలి సీడీని బొమన్ ఇరానీ ఆవిష్కరించగా, రవితేజ అందుకున్నారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా కూడా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్ సినిమా అవుతుందని నా నమ్మకం'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది'' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''సరైన సమయానికి సినిమా పూర్తి చేస్తానో లేదా అని మొదట్లో నాపై రవితేజగారికి అనుమానం ఉండేది. కానీ ఒకట్రెండుసార్లు కలవగానే నాపై ఆయనకు కొంచెం నమ్మకం కలిగింది. బీమ్స్ పాటలతో తన ప్రతిభ నిరూపించుకొన్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ టైగర్ టీంతో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.