నడిగర్ ఎన్నికల్లో విశాల్ గెలుపు

October 19, 2015 | 11:57 AM | 4 Views
ప్రింట్ కామెంట్
Vishal-victory-nadigar-elections-niharonline

విశాల్ తెలుగు వాడు కానీ ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమా తీయలేదు. కుటుంబం అంతా మొదటి నుంచీ చెన్నైలోనే సెటిలయ్యింది. తెలుగువాడనే కారణం చేత ఎన్నికలకు అర్హుడు కాడు అంటూ శరత్ కుమార్ వర్గం ఓ వివాదం లేవనెత్తింది. అయినా చివరికి విశాల్ వర్గమే గెలుపొందింది. పది సంవత్సరాల నుంచీ నడిగర్ సంఘంలో ఎలక్షన్లు నిర్వహించకుండా ఏకగ్రీవ ఎంపిక జరుగుతూ వచ్చింది.  అయితే సినిమా వాళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ పెండింగ్ లో ఉంటున్నాయనీ, అవకతవకలు జరుగుతున్నాయని ఈ సారి విశాల్ నేతృత్వంలో ఒక వర్గం ఏర్పడి మొదటిసారిగా ఓటింగ్ ద్వారా ఎన్నుకునే పద్ధతికి నాంది పలికినట్టయ్యింది.  విమర్శలు... తిట్లు... చివరికి కొట్టుకునే వరకూ వెళ్ళిన నగడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్గం గెలుపొందడం విశేషం. 
విశాల్ తమిళనాడు వాడు కాదు అని శరత్ కుమార్ వర్గం లేవనెత్తిన ఆరోపణలను కూడా తిప్పి కొట్టి  విశాల్ ను గెలిపించారు కోలీవుడ్ సినిమా వాళ్ళు. అయితే విశాల్ కుటుంబానిది తమిళ నాడు సరిహద్దుల్లో ఉండే చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామం. కానీ వాళ్ళు చాలా ఏళ్ళ క్రితమే తమిళనాడులో స్థిరపడిపోయారు. వారి కుటుంబం అంతా సినిమా పరిశ్రమలోనే పనిచేసింది. ఇప్పుడు విశాల్ ఫాదర్, అన్నయ్య కూడా ప్రొడ్యూసర్లు. మొదట విశాల్ డైరెక్షన్ రంగంలో పని చేసి ఆ తరువాత హీరో అయ్యాడు. 
ఈయన పానల్ లోని ప్రముఖ నటుడు నాజర్ శరత్ కుమార్ పై 109 ఓట్లతో గెలిస్తే, విశాల్ 141 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. మరో నటుడు కార్తి ట్రెజరర్ గా విజయం సాదించారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ నటీ నటులంతా ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అయితే విశాల్ ఓటు వేసేందుకు వెళుతుండగా ఈయనపై శరత్ కుమార్ వర్గం వారు దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే విశాల్ ను సన్నిహితులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి చేసిన వారెవరనేది గానీ, పోలీసు కంప్లయింట్ ఇచ్చిన విషయం గానీ ఏమీ వెల్లడి చేయలేదు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ