రవి తేజ సినిమా అంటేనే మ్యూజికల్ గా అన్ని పాటలూ హిట్ అవుతుంటాయి. ఆయనకు పాటలంటే ఎంతిష్టమో పవర్ సినిమాలో ఆయన తమన్ సంగీత దర్శకత్వంలో పాడిన(నౌటోంకి) పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే... ఆయన సినిమాలకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటారు. అయితే రాబోయే బెంగాల్ టైగర్ సినిమాకు మాత్రం ఓ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసుకున్నారట. ఆ డైరెక్టరే భీమ్. ఈయన ఇంతకు ముందు నువ్వానేనా, కెవ్వు కేక, జోరు, గాలిపటం సినిమాలకు పని చేశాడు. బెంగాల్ టైగర్స్ కు దేవీశ్రీ ప్రసాద్ ను ముందుగా అనుకున్నట్టువార్తలొచ్చాయి. కానీ మరెందువల్లో భీమ్స్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ అవకాశాన్ని భీమ్ చక్కగా ఉపయోగించుకో గలిగితే... అతను పెద్ద సంగీత దర్శకుల లిస్టులో చేరిపోయే అద్రుష్టం దక్కుతుందని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో రవి తేజ సరసన తొలిసారిగా సమంత హీరోయిన్ గా నటిస్తోంది.