మాస్ మహరాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం గురువారం (డిసెంబర్ 10న) థియేటర్లలో సందడి చేసింది. టీవీల్లో సినిమాపై టాక్ మాత్రం మిశ్రమ స్పందన అని వస్తున్నప్పటికీ అసలు టాక్ మాత్రం వేరేలా ఉంది. రవితేజ ఫెర్ఫామెన్స్ మేజర్ హైలెట్ గా నిలిచిన ఈ చిత్రం ఫుల్ మాస్ అండ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది.
మరోవైపు సోషల్ మీడియాలో చిత్రంపై టాక్ ఎలా ఉందంటే... చూడదగిన సినిమా అని కొందరు చెబుతుంటే, కామెడీతో నిండిపోయిన ఫస్టాఫ్ కోసమైనా చూడొచ్చని మాగ్జిమమ్ జనాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరికొందరైతే రొటీన్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉందంటున్నారు. సో... టోటల్ గా సినిమాపై పాజిటిక్ టాక్ వచ్చిందన్నమాట.
కిక్-2 డిజాస్టర్ తో ఢీలా పడిపోయిన రవితేజకు బెంగాల్ టైగర్ పై వస్తున్న టాక్ కాస్త ఊరట కలిగించేదే. సినిమా ఎబో యావరేజ్ టాక్ రావటంతో మాస్ రాజాకు ఓ డీసెంట్ హిట్ దక్కినట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. పాత కథే అయినప్పటికీ స్ర్కీన్ ప్లే, రాశిఖన్నా తమన్నా గ్లామర్ షో, పోసాని,పృథ్వీ కామెడీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్ పాయింట్లుగా నిలిచాయి.
ఇంకో రెండు వారాల దాకా పెద్ద సినిమాలు, ఓ మాదిరి సినిమాలు కూడా ఏవీ లేకపోవటంతో బెంగాల్ టైగర్ కలెక్షన్లు కుమ్ముకోవటం ఖాయంగా కనిపిస్తోంది.