చెన్నై ప్రభావం బాలయ్య మీదనా?

December 10, 2015 | 05:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chennai-floods-effect-on-balayya-dictator-movie-niharonline

భారీ వర్షాలతో వరదల కారణంగా చెన్నై నగరం ఎంత నష్టపోయిందో ఇప్పుడిప్పుడే ఓ అంచనాకి వస్తున్నారు. ఇక ఈ ప్రకృతి భీభత్సానికి అరవ సినీ పరిశ్రమ కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింది. స్టార్లకు సంబంధించిన ఇళ్లతోపాటు స్డూడియోలు కూడా దారుణంగా నాశనం అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ జాబితాలో మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా ఉన్నారు. వరదల్లో ఆయనకు చెందిన స్డూడియో కూడా తీవ్రంగా నష్టపోయాడట. దీంతో తన రాబోయే సినిమాలపై ఇది తీవ్రంగా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం బాలయ్య డిక్టేటర్ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

దెబ్బతిన్న తన స్టూడియో తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఒక నెల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. దీంతో 'డిక్టేటర్ రీ- రికార్డింగ్ కోసం ఒకనెల సమయం కావాలని దర్శకుడు శ్రీవాస్ ను థమన్ కోరాడంట. అయితే సినిమా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కి రిలీజ్ చేయాలని శ్రీవాస్ ఉన్నాడు. దీంతో మణిశర్మతో రీ - రికార్డింగ్ చేయించుకునేందుకు సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ రీ రికార్డింగ్ అందించిన చిత్రాలన్నీ హిట్ జాబితాలో ఉన్నాయి. మరి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? లేక సినిమానే పోస్ట్ పోన్ చేస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ