నటనలోనూ, టేకింగ్ లోనూ ఇప్పుడు ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంతో మంది క్రియేటివిటీ గల హెడ్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు. తమ కొత్త కొత్త ఆలోచనలను సినిమాకు జొప్పిస్తున్నారు. అవకాశం ఉంటే సిల్వర్ స్క్రీన్ లేదంటే షార్ట్ ఫిల్మ్స్... ఎక్కడై,నా టాలెంట్ గుర్తింపులోకి రావడం మాత్రం జరుగుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ లతో లిమిటెడ్ బడ్జెట్ లో చిన్న చిత్రాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్న మారుతి టీం వర్క్స్ ప్రోడక్షన్ లో సినిమా లవర్స్ సినమా బ్యానర్ లో వస్తున్న మరో చిత్రం బెస్ట్ యాక్టర్స్ . ఉర్వశి ధియేటర్స్ అసోసియోషన్ తో ఈ చిత్రం చేస్తున్నారు. నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్ , మదురిమ, కేషా . క్రాంతి, షామిలి, భార్గవి లు జంటలుగా నటిస్తున్నారు. కుమార్ అన్నం రెడ్డి నిర్మాతగా అరుణ్ పవర్ ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. జీవన్ బాబు(జె.బి) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28 విడుదల చేస్తున్నారు
ఈ సందర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ.. మారుతి టీంవర్క్స్ తో అనుభందంగా మా బ్యానర్ సినిమా లవర్స్ సినిమా పై బెస్ట్ యాక్టర్స్ చిత్రాన్ని తీసాము. నవ్విస్తూనే చక్కటి క్లైమాక్స్ ని అందిచాడు దర్శకుడు అరుణ్ పవర్. నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు జీవితాల్లో మరో కొంతమంది ఎంటరయ్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివరకి ఏమయ్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో సప్తగిరి వచ్చి చేసే కామెడి కి ధియోటర్ మెత్తం విజిల్స్ పడతాయి, ఈ చిత్రానికి సూపర్‌డూపర్ మ్యూజిక్ దర్శకుడు జె.బి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని అగష్టు 28న విడుదల చేస్తున్నాము. అయితే కేవలం నవ్వుకునే వాళ్ళు మాత్రమే ఈచిత్రానికి రావాలని మా విన్నపం. అని అన్నారు అరుణ్ పవర్ మాట్లాడుతు.. మారుతి గారికి ఈ కథ చెప్పాను, కథ కంటే కథనం చాలా బాగుందన్నారు. నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం నలుగు జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మెయిన్ కాన్సెప్ట్ వినోదంతో చెప్పాం. సెకండాఫ్ లో సప్తగిరి చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలానే అందరూ నటీనటులు సూపర్బ్ గానటించారు. జె.బి గారు అందించారు. నవ్విస్తాం నవ్వకపోతే మా ధియోటర్ కి దగ్గరకి కూడా రావద్దని మా మనవి. రెండు గంటలు నాన్‌స్టాప్ నవ్వించటమే మా ప్రయత్నం అగష్టు 28న మీ ముందుకు వస్తున్నాం.. మా చిత్రం విడుదలయ్యి విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అనేక రకాలుగా ముఖ్యంగా సెల్ఫి విడియోస్ తో మా యూనిట్ ని విష్ చేసిన ప్రముఖులకి, సిని అభిమానులకి మా ధన్యవాదాలు . అన్నారు నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్ , మదురిమ, కేషా . క్రాతి, షామిలి, భార్గవి , సప్తగిరి, తాగుబోతు రమేష్, కుమార్‌సాయి తదితరులు.. ఆర్ట్.. గోవింద్, పి.ఆర్.ఓ..ఏలూరు శ్రీను, కో-డైరక్టర్.. గౌతమ్ మన్నవ, సంగీతం- జె.బి, ఎడిటింగ్.. ఉద్దవ్.ఎస్.బి, కెమెరా.. విశ్వ.డి.బి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. దాసరి వెంకట సతీష్, సహ-నిర్మాతలు.. సందీప్ సేనన్, అనీష్.ఎమ్.థామస్, నిర్మాత.. కుమార్ అన్నంరెడ్డి, దర్శకత్వం- అరుణ్ పవర్