దర్శకత్వం నుంచి విజయ్ తండ్రి రిటైర్మెంట్

January 27, 2015 | 12:19 PM | 21 Views
ప్రింట్ కామెంట్

తమిళంలో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఎస్.ఎ.చంద్రశేఖర్ తన దర్శకత్వం బాధ్యతలనుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఈయన గత 4 దశాబ్దాలుగా తన ఫిల్మ్ కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇతను ఎవరో కాదు తమిళ హీరో విజయ్ కి తండ్రి. ‘టూరింగ్ టాకీస్’ అనే సినిమా జనవరి 24 విడుదలయ్యింది. ఇది ఎస్.ఎ. చంద్రశేఖర్ కు చివరి చిత్రం అవుతుంది. ఈ సినిమాకు తను దర్శకత్వం వహించడమే కాకుండా 75 సంవత్సరాల వృద్ధిడిగా కూడా నటించారట. ఆయన తన ఫిల్మ్ కెరీర్ లో ఇంత వరకు 69 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎస్.ఎ.చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్ ను ఇండస్ట్రీలో నిల దొక్కుకోడానికి మొదటి నుంచి గట్టి పునాదినే వేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ లో విజయ్ ను సూర్య, విక్రమ్ వంటి హీరోలతో పాటు ఒక టాప్ హీరోగా చూడగలుగుతున్నారు. ఇకనేం సుపుత్రుడు ఒక పెద్ద హీరోగా ఎదిగాడు కాబట్టి తను రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబోలు ఈ డైరెక్టర్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ