కమర్షియల్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిన చాలా మందికి పీకూ లాంటి సాదా సీదా సినిమా చూడాలని చాలా ఎదురు చూస్తున్నారు. దీని ట్రైలర్ చూస్తుంటే పన పక్కింట్లో వారి కథ అన్నట్టుగా సాగుతోంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్ కు అమితాబ్ బచ్చన్ రాలేక పోతున్నాడట. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో జరగనున్న ప్రమోషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలుపుకున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కులాసాగానే ఉన్నట్టు, ఎప్పటి కప్పుడు అందరితో ఈ విషయాలు పంచుకోకపోతే తోచదన్నట్టు ట్వీట్ చేశారు. అయితే పీకూ సినిమా మే 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.