మహేష్ భట్ గారాలపట్టి అలియాభట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉందట. ఆమె ఈ మధ్యే షూటింగ్ లో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. గాయం విల్ల దొరికిన విరామ సమయాన్ని ఆమె హైదరాబాద్ చూసేందుకు వినియోగించుకుంటోందట. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, టూ స్టేట్స్ సినిమాల్లో నటించిన అలియా భట్ ప్రస్తుతం కరణ్ జోహార్ తీస్తున్న కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటిస్తోంది. సిద్దార్త్ మల్హోత్రా, రిషి కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్లో అలియా భుజానికి గాయం అయ్యింది. వైద్యులు సూచన మేరకు కొద్ది రోజులు రెస్టు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ అమ్మడు కుటుంబంతో సహా హైదరాబాద్ ను చూడ్డానికి వచ్చిందట. ఎన్నాళ్ళ నుంచో ఫలక్ నుమా ప్యాలెస్ చూడాలని ఈ అమ్మడి కోరిక ఇన్నాళ్ళకు తీరుతోందట. ఆ అద్భుత కట్టడాన్ని తిలకిస్తూ పనిలో పనిగా హైదరాబాద్ అందాలన్నీ చూసేద్దామనుకుంది. మరి ఈ కుర్రది బయట కనిపిస్తే హైదరబాదీ కుర్రకారు ఊర్కుంటారా? పాపం సేద తీరదామని వచ్చింది... అలియా హైదరాబాద్ ను గౌరవించేలా చేయండి కుర్రకారూ...