కమల్ కి శ్రుతిసినిమాలేవీ నచ్చలేదట

June 26, 2015 | 04:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kamal_and_shruti_hassan_niharonline

కొందరు పిల్లలు ఏది చేసినా ఓహో.... ఆహా... అంటూ గొప్పలు చెప్పుకుంటారు తల్లిదండ్రులు. మరి కొందరయితే ఆమె నొచ్చుకుంటుందేమో అని చేసేది నచ్చకపోయినా... పొగిడేస్తుంటారు. కానీ కమల్ హాసన్ మాత్రం మొహమాటాలకు పోడు... పిల్లల విషయంలో కూడా. శ్రుతి హాసన్ నటించిన సినిమాల్లో మీకేది నచ్చిందని అడిగిన ప్రశ్నకు నాకు ఏదీ బాగా లేదంటూ కుండబద్దలు కొట్టేశాడాయన. ‘‘నిర్మొహమాటంగా చెపుతున్నా... శ్రుతి ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ బాగా చేసినట్లు అనిపించలేదు. అసలు ఆమె నటించిన సినిమలేవీ నచ్చలేదు. కొన్ని సినిమాలు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. తన టాలెంట్ ఏంటో ఆమెకు తెలియట్లేదు. ఆ టాలెంట్ కు తగ్గ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా... నటిగా శ్రుతి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని చెప్పుకొచ్చాడు కమల్. శ్రుతిని తన నట వారసురాలిగా ప్రకటిస్తారా అంటే.. అది ఇప్పుడే చెప్పలేనన్నాడు. అది శ్రుతినే రుజువు చేసుకోవాలని... తాను ఆ మాట అనలేనని కమల్ చెప్పాడు. శ్రుతి ఎప్పుడూ నటిగానే ఉంటుందో లేదో తాను చెప్పలేనని... ఆమె తనకిష్టమైన సంగీతంలోకి వెళ్ళిపోయినా పోవచ్చు.  ఏదైనా తన ఇష్టం. తాను ఏది బలవంతపెట్టి చేయించనని చెప్పారు కమల్ హాసన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ