ఇప్పుడు వచ్చే సినిమాల్లో కథ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు కథ ఉండడం లేదనే చెప్పాలి. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా హీరోని హైటెల్ చేస్తూ కథ నడిపించేస్తున్నారు. అంటే సినిమా మొత్తంలో పాటలు హీరోయిజం పంచ్ డైలాగులు, ఫైట్లు, జోకులు ఇదే కథంటే... ఇక కథా రచయిత ఎవరనే చర్చకు తావెక్కడిది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో రిలీజైన భజిరంగి బాయిజాన్ కథ గురించి చర్చలు జరుగుతున్నాయంటే... అది మన తెలుగు వాళ్ళూ గర్వించ దగ్గ అంశం కారణం ఈ కథ ఎవరిదో మనందరికీ తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను ఓ వారంలో రాసి ఇచ్చేశారట. కాకపోతే పసివాడి ప్రాణం కథలా ఉందన్న విమర్శ (ఆ కథ కూడా ఈయనే రాశారు) వచ్చినప్పటికీ ఆ సినిమాలో ఓ మూగబ్బాయి, ఈ కథలో ఓ మూగమ్మాయి అదే పోలిక తప్ప కథంతా వేరు. దీన్ని కాపీ అనలేం కదా... ప్రస్తుతం భజిరంగి భాయిజాన్ దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిరస్తోంది. వారం కిందే విడుదలైన బాహుబలి బాలీవుడ్ జనాలు సైతం విస్తుపోయేలా వసూళ్ల ప్రభంజనమే సాగిస్తోంది. ఈ రెండు సినిమాలకూ కథ విజయేంద్ర ప్రసాదే అన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు మాత్రమే కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్.. తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాకు అది కూడా సల్మాన్ లాంటి పెద్ద స్టార్ మూవీకి కథ అందించడం విశేషంగా బాలీవుడ్ లో జనాలు చర్చించుకోవడంపై మన తెలుగువాళ్ళందరూ గర్వించాలి.