ఎంత స్టార్లయినా పర్సనల్ లైఫ్ కు కూడా అదృష్టం కలిసి రావాలండీ... అది కెరీర్ ముందునుంచే ప్లాన్ చేసుకోవాలి. కేవలం డబ్బే ప్రధానం అనుకొని ఏజ్ ముదిరిపోయేవరకూ... పెళ్ళి ఆలోచనలేకుండా గడిపేస్తే... ఆనక జీవితం చివరి వరకూ రాజీ బతుకే అవుతుంది. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ పెద్దల సలహాతో జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. వారి పాప ఆరాధ్య ఇంతమంది స్టార్ల మధ్య హాపీగా గడిపేస్తుంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లాడి జెనీలియా ఏడాది కిందటే ఓ బిడ్డకు జన్మనిచ్చి, చాలా చాలా హ్యాపీ గా ఉన్నారు. కానీ సీనియర్ హీరోయిన్ అయిన రాణీ ముఖర్జీ 37 ఏళ్ళ వయసులో సీక్రెట్ ప్రసవానికి రెడీ అవుతోంది. అది కూడా దేశం కాని దేశంలో. కారణం... పెళ్ళయి భార్య పిల్లలు ఉన్న నిర్మాతతో ప్రేమాయణం. ఫిలింమేకర్ ఆదిత్యచోప్రాతో చాలా కాలం సహజీవనం సాగించిన రాణీ గత ఏడాది హడావుడిగా పెళ్లి చేసేసుకుంది. ప్రస్తుతం ఈ జోడీ ఓ బిడ్డకు జన్మనీయబోతున్నారు. ఇంత సీక్రెట్ గా కన్న ఆ బిడ్డను పెంచడమెలా? ఎంత అభద్రతా భావం.... ఈ ఏడాది జూలైలోనే లండన్ వెళ్లిపోయింది రాణీ ముఖర్జీ. అక్కడే ప్రసవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె జనవరిలో బిడ్డకు తల్లవుతుందట. రాణీ ముఖర్జీ మరదలు జ్యోతి ముఖర్జీ నోరు జారడంతో ఈ విషయం బయటికి పొక్కింది.