ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో....

May 29, 2015 | 12:32 PM | 5 Views
ప్రింట్ కామెంట్
dharmendra_hospitalized_niharonline

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా పేరొందిన హేమమాలిని భర్త ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తీవ్రమైన భుజం నొప్పి, నిస్సత్తువతో ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందనీ, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు మాత్రం డాక్టర్లు అంగీకరించడం లేదు. మామూలు చెకప్ కోసం చేరినట్టు చెపుతున్నారు. అలాంటప్పడు మాట్లాడ్డానికి సమస్య ఏమిటని? కొందరు ప్రశ్నిస్తున్నారట. మరింత క్లారిటీ మాత్రం డాక్టర్ ఇవ్వడం లేదట. బాలీవుడ్ లో వీరిది ఒక సినీ కుటుంబమనే చెప్పాలి. ఆయన భార్య హేమామాలిని ధర్మేంద్రతో నటించిన సమయంలో అతన్ని పెళ్ళి చేసుకుంది. ఈమె కూతురు కూడా సినిమాలో నటించింది. తండ్రీ కొడుకులు ధర్మేంద్ర, సన్నీడియోల్‌, బాబీడియోల్‌ కలిసి నటించిన 'యమ్లా పాగ్లా దీవానా' మంచి సక్సెస్ అయ్యింది. సమీర్‌ కార్నిక్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ చిత్రం హాస్యతరహా కథాంశంతో రూపొందించారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా పేరొందిన హేమమాలిని భర్త ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తీవ్రమైన భుజం నొప్పి, నిస్సత్తువతో ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందనీ, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు మాత్రం డాక్టర్లు అంగీకరించడం లేదు. మామూలు చెకప్ కోసం చేరినట్టు చెపుతున్నారు. అలాంటప్పడు మాట్లాడ్డానికి సమస్య ఏమిటని? కొందరు ప్రశ్నిస్తున్నారట. మరింత క్లారిటీ మాత్రం డాక్టర్ ఇవ్వడం లేదట. బాలీవుడ్ లో వీరిది ఒక సినీ కుటుంబమనే చెప్పాలి. ఆయన భార్య హేమామాలిని ధర్మేంద్రతో నటించిన సమయంలో అతన్ని పెళ్ళి చేసుకుంది. వీరికి ఇద్దరు  కూతుర్లు ఈష, ఆహన. దర్మేంద్ర మొదటి సంతానమైన సన్నీడియోల్, బాబీడియోల్ ఇద్దరూ హీరోలే,  తండ్రి ఇద్దరు కొడుకులు  కలిసి నటించిన 'యమ్లా పాగ్లా దీవానా' మంచి సక్సెస్ అయ్యింది. సమీర్‌ కార్నిక్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన ఈ చిత్రం హాస్యతరహా కథాంశంతో రూపొందించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ