బ్రూస్ లీ సెట్ లో బాద్ షా సందడి

October 07, 2015 | 05:11 PM | 6 Views
ప్రింట్ కామెంట్
shah-rukh-khan-ram-charan-bruce-lee-sets-niharonline_(1)

రామోజీ ఫిల్మ్ సిటీ పుణ్యమా అని ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్లందరూ హైదరాబాద్ ను తెగ దర్శించుకుంటున్నారు. ఇటీవల ‘దిల్ వాలె’ సినిమా షూటింగ్ కోసం షారూఖ్ ఖాన్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టే చేశారు. అక్కడ జరిగే తెలుగు సినిమా షూటింగ్ లను కూడా సందర్శిస్తున్నాడు షారూఖ్. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్   బ్రూస్ లీ  షూటింగ్  లో  కూడా షారుఖ్ సందడి చేశారట. రామోజీ ఫిల్మ్ సీటిలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీలోని ‘లేలే బ్రూస్ లీ..నీ చూపుతో తగిలింది గుగ్లీ’ అనే పాట చిత్రీకరణ జరుపుకుంటుందంట..ఆ సెట్ కు వచ్చిన షారుఖ్  చరణ్ వేసే స్టెప్పుల్ని చూసి  ఫిధా అయిపోయాడట. నిజానికి ఈ సాంగ్ షూటింగ్ ను మూడు రోజుల్లో పూర్తి చేయాలనుకున్నా..రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ పట్టుబట్టి ఓ రాత్రిలో కంప్లీట్ చేసేసింది. షూటింగ్ మధ్య గ్యాప్ లో షారుఖ్, చరణ్ జోకులేసుకుంటూ ఒకటే ఎంజాయ్ చేశారని టాక్. చరణ్, రకుల ప్రీత్ సింగ్ మీద ఈ సాంగ్ చిత్రీకరించారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ