నిన్న మొన్నటి వరకూ పెద్దాయకు తక్కువా... కుర్రాడికి ఎక్కువా... అనుకున్నాం బ్రహ్మాజిని... కానీ కొడుకు పెళ్ళి చేశాడనే సరికి ఇతగాడి ఏజ్ కాస్తా బయట పడిపోయింది పాపం... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఈయన పెళ్ళి పిచ్చి గోల గుర్తుకు వస్తే నవ్వు ఆపుకోలేం... చాలా బాగా నటించాడీ ముదురు పెళ్ళి కొడుకు. క్యారెక్టర్ నటుడిగా మంచి స్వింగ్ లో ఉన్నాడు బ్రహ్మాజీ. అటు విలన్ రోల్స్, ఇటు కామెడీ రోల్స్ చక్కగా పండించగలడీయన. ఇటీవలి కాలంలో ప్రతి సినిమాలో బ్రహ్మాజీకి ఓ క్యారెక్టర్ ఉంటోంది. ఇప్పుడు ఆయన ఖాతాలో అరడజను పైగా సినిమాలున్నాయి. ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్, చరణ్ ‘బ్రూస్లీ’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, మహేష్ ‘బ్రహ్మోత్సవం’, మేర్లపాక గాంధీ సినిమా... ఇలా లైన్లో చాలానే ఉన్నాయి. ఇదిగో బ్రహ్మాజీ లేటెస్టు గెటప్ చూశారా?. బెగ్గర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిలా... మంచి స్టైలిష్ అతుకులతో... బాగున్నాడు కదా... ఇతన్నిలా డిజైన్ చేసింది డైరెక్టర్ మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మేర్లపాక మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ని బ్రహ్మాజీ కోసం క్రియేట్ చేశాడు. మరి వెంకటాద్రి పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కు అంత నచ్చాక ఈ నటుడిని ఎలా వదిలి పెడతాడాయన? అందుకే ఈ గెటప్... ఈ చిత్రంలో శర్వానంద్ కథానాయకుడు.