సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించిన చివరిపాట చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 6వ తేదీ సాయంత్రంతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికావటంతో ఆ మరుసటి రోజే ఆడియో వేడుకను జరపడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మధురం పాట యూట్యూబ్ లో వైరల్ అయ్యింది కూడా. ఓ ప్రముఖ చానెల్ కు లైవ్ టెలికాస్ట్ రైట్స్ ను భారీగానే అమ్మిందట పీవీపీ. ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా కోసం 10 పాటలను రెడీ చేసినా, 8 పాటలను మాత్రమే వాడినట్టుగా తెలుస్తోంది. ఈ పాటలన్నీ కూడా మెలోడీతో కూడుకుని సంతోషాన్నీ, సంబరాన్ని కలిపి అందిస్తూ పసందుగా కొనసాగుతాయని చెబుతున్నారు. దర్శకుడు శ్రీ కాంత్ అడ్డాల ఈ పాటలను నయన మనోహరంగా చిత్రీకరించాడని అంటున్నారు. అనుబంధాల నేపథ్యంలో కొనసాగే కథకు ప్రతి పాట బాగా అమరుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆడియో రిలీజ్ తరువాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మే నెలలోనే చిత్రాన్ని విడుదల చేసి సమ్మర్ సెలవులను ఉపయోగించుకోవాలని మహేష్ నిర్మాతలకు చెబుతున్నాడంట.