బ్రహ్మోత్సవం బిజినెస్ లెక్క అదన్నమాట

May 02, 2016 | 05:57 PM | 3 Views
ప్రింట్ కామెంట్
brahmotsavam-pre-release-business-niharonline

ఫస్టులుక్ .. మోషన్ పోస్టర్ .. టీజర్ .. వెరసి ఆడియో పంక్షన్ కి సిద్ధమైపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్. బ్రహ్మోహోత్సవంతో ఈ సమ్మర్ లో మరో పండగను అందించేందుకు సిద్ధమైపోతున్నాడు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ నుంచి వస్తున్న చిత్రం కావటం,  సీతమ్మ వాకిట్లో తర్వాత శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీస్తున్న చిత్రం కావటం, పైగా ముగ్గురు హీరోయిన్లు వెరసి ఇన్ని ప్రత్యేకతలు ఉండటం ఈ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఆ అంచనాలతోనే అన్ని ఏరియాల్లోను ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది.

                                ఇక బిజినెస్ విషయానికొస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ 50.50కోట్లకి జరిగినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో 7 కోట్లు, మిగతా ఏరియాల్లో 1.5 కోట్లు,  ఓవర్సీస్  లో 13 కోట్లు మొత్తం మీద 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ఇక ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ వెర్షన్ రైట్స్ , యూట్యూబ్ రైట్స్ కలుపుకుని 100 కోట్ల మార్క్ చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.  ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వస్తున్న చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే చాలు రికార్డులన్నీ బద్ధలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ