శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ జంటగా నటించిన బ్రూస్ లీ ది ఫైటర్ చిత్రం ఆడియో అట్టహాసంగా జరిపారు. హైటెక్స్ లో జరిగిన ఈ వేడుకకు జన సందోహం వెల్లు వెత్తింది. మెగా అభిమానులంతా చాలా సందడి చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో రామజోగయ్యశాస్త్రి 4 పాటలు రాశారు.
అతిథి పాత్రలో నటించిన బ్రూస్ లీ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసమేతంగా విచ్చేశారు. సెలవు రోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాటను శ్రీనువైట్ల జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. ఈ పాటకు 6 లక్షల హిట్స్ రావడం ఈ యూనిట్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన చిరంజీవి 60 సంవత్సరాల వేడుకలో మొదటి రోజున పవన్ కళ్యాన్ హాజరు కాకపోయినా ఆ తర్వాత చిరంజీవి ని కలిసి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇప్పుడు బ్రూస్ లీ ఆడియోకు కూడా గైర్హాజర్ అయ్యారు. ఆయన సర్దార్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.