మిల్కీ గురించి బబ్లీ బ్యూటీ ఏం చెప్పింది?

November 16, 2015 | 05:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
tamanna_rashi_khanna_relationship_niharonline

సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు నటిస్తూ, వాళ్లిద్దరూ ఒకే సెట్లో వుంటే చిటపటలు ఖాయమని చెప్పుకుంటూ వుంటారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో, అయితే అదే విషయాన్ని రాశీఖన్నా దగ్గర ప్రస్తావిస్తే  మాత్రం అలాంటిదేం లేదంటోందీ. తెలుగు తెరకి ఈమధ్య కాలంలో పరిచయమైన గ్లామర్ కథానాయికలలో రాశీఖన్నా ముందు వరుసలో కనిపిస్తుంది. ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'బెంగాల్ టైగర్' సినిమాలో నటించింది. ఇందులో రవితేజ సరసన తమన్నాతోపాటు రాశి స్ర్కీన్ షేర్ చేసుకుంది. అయితే షూటింగ్ స్పాట్ లో వారి మధ్య రిలేషన్ ఎలాంటిదో అని కదిలిస్తే ఆసక్తికర విషయాలు చెబుతోంది.

 తమ మధ్య గొడవల్లాంటివేం జరగలేదని అంది. తమన్నా చాలా కూల్ గా తన పని తాను చేసుకుపోతుందనీ, సీనియర్ ఆర్టిస్ట్ ని అనే ఫీలింగ్ తనలో ఎప్పుడూ కనిపించలేదని చెప్పింది. ఇగో అనేది ఆమెలో మచ్చుకైనా లేదనీ, మొదటినుంచి చివరివరకూ తనతో చాలా సరదాగా మాట్లాడుతూ గడిపిందని అంది. తమన్నాతో కలిసి నటించడం వలన తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పింది. నటనకి సంబంధించి తనకి తెలియని చాలా విషయాలను ఆమె చెప్పిందనీ, తనకున్న మంచి స్నేహితులలో తమన్నా కూడా చేరిపోయిందని చెప్పుకొచ్చిందీ బబ్లీ బ్యూటీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ