సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని పూర్తిగా కథ ఓ కొలిక్కి వచ్చాక షూటింగ్ మొదలు పెట్టుకున్నారు బన్నీ-బోయపాటి. అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటితో పని చేయడం ఇదే మొదటి సారి. అర్జున్ ఇప్పటి వరకూ కనిపించని మాస్ లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టి న మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ ఓ కీలక చేజింగ్ సీన్ ని షూట్ చెయ్యడమే కాకుండా హీరోయిన్ కేథరిన్, విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి, అల్లు అర్జున్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ హైదరాబాద్ లోనే మొదలు కానుంది. ఈ చిత్రంలో వినోదం తో పాటు కుటుంబ విలువలను చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ అల్లు అర్జున్ తో మొదటి సారిగా జత కడుతోంది. ఇంకా శ్రీకాంత్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘సరైనోడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.