జాతిని అగౌరపరిచారంటూ తండ్రీ కొడుకులపై కేసు...

June 18, 2015 | 01:17 PM | 0 Views
ప్రింట్ కామెంట్
bigb_abhishek_national_flag_insult_case_niharonline

సెలబ్రిటీలకు ఇప్పుడు ఊపిరి సలపని పరిస్థితి.... ఎటు నుంచి ఏం కేసు వచ్చి పడుతుందో నని భయపడి పోతున్నారు. ఇప్పటికే అమితాబ్ మ్యాగీ న్యూడిల్స్ కేసుతో సతమతమై పోతుంటే మళ్ళీ జాతిని అగౌర పరిచాడంటూ మరో కేసులో చిక్కుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. జాతీయ జెండాను, జాతిని అవమానించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వీరిద్దరిపైన  కేసు నమోదైంది. త్రివర్ణ పతాకాన్ని అవమానించారని ఆరోపిస్తూ చేతన్ ధిమన్ ఆనే వ్యక్తి ఈ  ఫిర్యాదు చేశారు. ఇండియా పాకిస్తాన్ ప్రపంచ కప్ సందర్భంగా అడిలైడ్ లో జరిగిన  క్రికెట్ మ్యాచ్ లో ఫిబ్రవరి 15న  తమ ఒంటిపై జాతీయ జెండాను కప్పుకుని భారతీయ జెండాను కించ పరిచారని  చేతన్ ఆరోపించారు.  తండ్రీ కొడుకులిద్దరూ జాతికి తీరని అవమానం చేశారని  జ్యుడీషియల్  మేజిస్ట్రేట్ ముందు ఆయన ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మెగాస్టార్ అమితాబ్ లాంటి వారు ఇలా జాతికి అవమానకరంగా  ప్రవర్తించడం సరికాదని చేతన్ లాయర్ సంజీవ్ శర్మ వ్యాఖ్యానించారు.  జాతి గౌరవ  చట్టం ప్రకారం ఇది నేరమని, ఇందులో కొడుకులిద్దరికీ నోటీసులు జారీ చేయాలని ఆయన కోరుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ