పూరి జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నట్టు సోషల్ నెట్ వర్క్ లో నితిన్ చెప్పుకున్నాడు. అప్పటికే ఈయన నిర్మాతగా అఖిల్ సినిమాతో బిజీగా ఉండి, ఈ సినిమాను రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తాడబ్బా? అని ఇండస్ట్రీలో చర్చలు కూడా జరిగాయి. అనుకున్నట్టు గానే ఏ కారణాలవల్లో ఈ హీరో తప్పుకున్నాడు. వెంటనే అతనికి బదులుగా వరుణ్ తేజ్‌తో ఆ సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేసారు డైరెక్టర్ పూరీ. ఇంతలో చిరు సినిమా నుంచి పూరీని తప్పించారని ఒక వార్త... లేదు లేదు... ఆయనే అంటూ మరో వార్త... నితిన్ ఆ చిత్రం నుంచి తప్పుకోవడం నేరం అన్నట్టు రాంగోపాల్‌వర్మ అతడిపై మాటల దాడి చేసాడు. ఇంత హడావుడిగా ఎందుకు అనౌన్స్ చేసినట్టు అని నాగబాబు ఫైర్ అయినట్టు మరో గాలి వార్త కూడా వచ్చింది. ఇక పూరి జపం చేస్తున్న ఛార్మి అయితే ఆ సినిమా తీయడానికి నితిన్ దగ్గర డబ్బుల్లేవని కామెంట్ చేసి, మళ్ళీ క్షమాపణ కూడా చెప్పింది. అయితే హడావుడి చేసినంతగా ఈ సినిమాను మొదలు పెట్టలేదు. చిరంజీవితో 150వ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో స్టార్ట్ చేస్తానన్న పూరి జగన్నాథ్ ఈలోగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేయాలని అనుకున్నాడు. కానీ వరుణ్ కూడా అందుబాటులో లేడని ఓ వార్త వచ్చింది. మరి పూరీ గారు ఈ సినిమా మొదలు పెడతారా? లేక చిరు సినిమా అయ్యాక చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.