షాహిద్ కపూర్ పెళ్ళికొడుకవుతున్నాడు

March 23, 2015 | 04:11 PM | 41 Views
ప్రింట్ కామెంట్
mira_rajput_shahid_niharonline

దాదాపు పదేళ్ళుగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ బ్రేకప్ ల పర్వాన్ని కొనసాగించిన ఈ షాహిద్ కపూర్ చివరికి ఓ ఇంటివాడువుతున్నాడు. కరీనా కపూర్ తో కొన్నాళ్ళు, ప్రియాంక చోప్రాతో కొన్నాళ్ళు డేటింగ్ చేసి, ప్రేమలో ఫెయిలయిన ఈయన గారు ఇక తాను ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్ళాడనని, హోమ్లీగా ఉండి చక్కని కుటుంబ నేపథ్యం కలిగిన అమ్మాయినే పెళ్ళాడతానని చెప్పుకున్నాడు. అయితే చాలా సీక్రెట్ గా ఢిల్లీకి చెందిన మీరా రాజ్పుత్ అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకున్నాడట. ఆ అమ్మాయి ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ (మహిళా)లో ఇంగ్లీష్ హానర్స్ డిగ్రీ  మూడవ సంవత్సరం చదువుతోందట. షాహిద్ ఈ అమ్మడు ఓ సత్సంగ్ లో కలిసారట. నటుడైన షాహిద్ తండ్రి పంకజ్ కపూర్ ఇటీవలే మీరా రాజ్ పుత్ తల్లిదండ్రులను కలిసి వీరిరువురి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారట. వచ్చే డిసెంబర్ లో వీరి పెళ్ళి జరగనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ