వర్తమాన నటి జియాఖాన్ మరణం వెనుక వెన్నులో వణుకు పుట్టించే నిజాల్ని బయట పెట్టింది సీబీఐ. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అగ్రనటిగా వెలుగొందుతునుకుంటున్న సమయంలో జియాఖాన్ ఆత్మహత్య బాలీవుడ్ లో అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ప్రేమలో విఫలం కావటం మూలంగానే తాని లోకాన్ని విడిచి వెళ్తున్నట్లు జియాఖాన్ లేఖ రాసి మరీ చనిపోయింది. అయితే మృతిపై జియా బంధువులు అనుమానాలు వ్యక్తం చేయటంతోపాటు, సెలబ్రిటీ మరణం కావటంతో కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు చేసిన సీబీఐ చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించింది.
మరణించే సమయానికి జియాఖాన్ 4 నెలల గర్బవతి అని, ఆమె ప్రియుడు సూరజ్ పంచోలీ బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించాడని పేర్కొంది. జియాఖాన్- సూరజ్ పంచోలి 2012లో ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే వీరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఇది కొంత కాలం కొనసాగిన తర్వాత జియా ఖాన్ గర్బవతి అయింది. ఈ విషయాన్ని ఆమె సూరజ్ పంచోలీకి చెప్పడంతో.. జియాఖాన్‌కు అబార్షన్ అయ్యేందుకు టాబ్లెట్లు ఇప్పించాడు. అవి పని చేయలేదు. ఆసుపత్రికి వెళితే గొడవ అవుతుందని.. దాని వల్ల కెరీర్ దెబ్బ తింటుందనే భావించిన సూరజ్ దారుణానికి పాల్పడ్డాడు. బలవంతంగా సూరజే ఆమెకు ఆబార్షన్ చేశాడట. ఆ తర్వాత పిండాన్ని అతడు టాయిలెట్ లో పడేశాడట. దీంతో ప్రియుడి కర్కశమైన వ్యవహార శైలితో మనస్థాపం చెందిన జియా మూడు పేజీల లేఖ రాసి ఆత్మహత్యచేసుకున్నట్లు చార్జ్ షీట్ లో తెలిపింది సీబీఐ.
ఈ కేసులో జూహూ పోలీసుల దర్యాప్తు నివేదికతో పాటు.. 11 మంది వైద్యుల నుంచి సీబీఐ సాక్ష్యాలను సేకరిచింది. సూరజ్ పంచోలీ ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని లేఖలు, పెన్ డ్రైవ్‌లు, మెమెరీ కార్డులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకుంది. విచారణ సమయంలో జియాఖాన్ 14 ఏళ్ల వయసులో రేప్ కి గురైందని, ఆమెకు రుతుస్రావ సమస్యలు ఉన్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుందని సూరజ్ సంబంధం లేని విషయాలు చెప్పటం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించాడని సూరజ్ పంచోలిపై అభియోగం మోపిన సీబీఐ.. ఐపీసీ 306 కింద కేసు పెట్టింది. ఈ కేసులో సూరజ్‌పంచోలీపై నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.