బుజ్జాయిల రంగుల సంబరం

March 07, 2015 | 05:34 PM | 49 Views
ప్రింట్ కామెంట్
nirwana_niharonline

నిన్న జరిగిన హోలీ వేడుకలో ఈ బుజ్జి సెలబ్రిటీలిద్దరూ పెద్ద టాపిక్ అయ్యారు ఒకరు మంచులక్ష్మి కూతురు నిర్వాణఅయితే, మరొకరు అల్లు అర్జున్ కొడుకు అయాన్. ఈ ఇద్దరు పిల్లలనూ ప్రతి పండుగలోనూ ఇన్వాల్వ్ చేసేస్తున్నారు వీరి పేరెంట్స్. నిజానికి చిన్న పిల్లలు ఏదిచేసినా పెద్ద వాళ్ళకు పండుగే. మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అలా వీరిద్దరినీ చూసినా అంతే కన్నుల పండుగ... ఈ సంతోషం పెద్ద వీరి వాళ్ళదే కాదు... చూస్తున్న అభిమానులందరిదీ.... హోలీ సందర్భంగా మంచు లక్ష్మి ప్రసన్న తన కూమార్తె నిర్వాణకు రంగులు పూసి పండుగ చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్‌ తనయుడు అయాన్‌. ఏ పండుగ వచ్చినా దానికి తగ్గట్టుగా డ్రెస్‌లు వేస్తూ ఎంజాయ్‌ చేస్తారు. హోలీ సందర్భంగా అయాన్‌ రంగుల మధ్య సందడి చేస్తున్నాడు. తమకు రంగులు పూసిన తల్లిదండ్రులను చూసి పాలబుగ్గల పసికూనలు బోసి నవ్వులతో అందర్ని ఆకట్టుకుంటున్నారు. ఈ చిన్నారి ఫోటోలను సోషల్‌ వెబ్‌సైట్లలో పెట్టి వారి అభిమానలతో హోలీ వేడుకను పంచుతున్నారు. ఇక అల్లు అయాన్ పండుగ వేడుకల్లో పాలుపంచుకోవడమే కాదండీ తెరపై తండ్రితో పాటు నటిస్తాడట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, అల్లు అర్జున్ రాబోయే సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపిస్తాడని సమాచారం. ఈ ముద్దులొలికే బుజ్జాయి కోసమైనా సినిమా చూడాల్సిందే మనమందరం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ