ఎన్ని జాగ్రతల్లు తీసుకున్న సినిమాలు పైరసీ బారిన పడుతూనే ఉన్నాయి. బాహుబలి సినిమా కూడా పైరసీ బారిన పడకుండా సరికొత్త చర్యలు చేపట్టినప్పటికీ... ఈ సినిమా కూడా పైరసీ జరిగిన ప్రైవేట్ బస్సుల్లో టూరిస్టులకు వినోదం పంచుతోంది. సినిమా ఇలా రిలీజైన మరునాడే పైరసీ సీడీలు బయటకు వస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు పైరసీ సినిమా థియేటర్లలో జరిగేది. కానీ తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' పైరసీ కేసులో సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 29 న విడుదలయిన ప్రేమమ్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో కేరళ స్టార్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి హేమాహేమీలు లేక పోయినా కాసులు కురిపిస్తోంది. జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిలవుతుంటారు. దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ ఇలాంటి మూడు దశలను మనసుకు హత్తుకునేలా చూపించడంలో సఫలమవడంతో ఈ సినిమా కాసులు కురిపిస్తోంది.