పెళ్ళయినా, తల్లయినా తన స్థానాన్ని మాత్రం ఏ మాత్రం జారనీకుండా... ఇప్పటికీ అభిమానుల, ఇండస్ట్రీ మన్ననలు పొందుతున్న బాలీవుడ్ తార కాజోల్. ఇప్పుడు ఆమెకు ఓ అరుదైన అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రసార భారతి పార్ట్ టైమ్ మెంబర్గా నియమితమయ్యే అవకాశాలు ఆమెకు మెండుగా ఉన్నాయట. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్కు కొత్త లుక్ తెచ్చే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దూరదర్శన్కు మరింత ప్రచారం కల్పించడంలో భాగంగా పలువురు ప్రముఖులను తాత్కాలిక బోర్డు మెంబర్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సినిమా రంగం నుండి ఇందు కోసం కాజోల్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.