‘చందమామ కథలు’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ మరో చిత్రం తెరకెక్కించబోతున్నాడు. మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రాన్ని మొదలు పెట్టారు.. ఆర్కె స్టూడియో ఆధ్వర్యంలో ఈ సినిమాను రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధూ, నరేష్, శ్రధ్దాదాస్, రశ్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. విభిన్నమైన కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు అందమైన లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రం ద్వారా దాదాపు 200 మంది స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతున్నట్టు త్వరలో మిగిలిన వివరాలు అధికారికంగా తెలుపనున్నట్టు తెలుస్తోంది.