బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' మూవీ మరో కొత్త రికార్డును సృష్టించింది. చైనాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతూ 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ కాకుండా ఇతర దేశంలో ఇంత పెద్ద మొత్తం వసూలు సాధించిన సినిమాగా పీకే మొదటి స్థానం సంపాదించింది గత నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, అనుష్క వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'పీకే' బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 615 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.