ప్రారంభంలో చిన్న బడ్జెట్ సినిమాలు తీసి... అందరి దృష్టిలో పడిపోయాడు చంద్రశేఖర్ యేలేటి. గున్నం గంగరాజు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, ఆ తరువాత ఆయన ప్రొడ్యూస్ చేయగా ఐతే, అనుకోకుండా ఒక రోజు సినిమాలు చేశారు. రెండూ మంచి కలెక్షన్ తెచ్చి పెట్టాయి. అలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుపోతూ తన డైరెక్షన్ లో ఏదో ఓ ప్రత్యేక ఉంటుందని నిరూపించుకున్నాడు. గోపీ చంద్ తో నేనొక్కడినే, సాహసం సినిమాలు చేసి కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడని నిరూపించుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు మోహన్ లాల్ గౌతమి లాంటి సీనియర్లతో ఓ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించబోతున్న ఈ సినిమాకు ‘మహిమ’అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో మధ్య తరగతి జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమా కన్నడ వెర్షన్ లో శివరాజ్ కుమార్ నటించనున్నారు. నవంబరు నెలాఖర్లో ‘మహిమ’రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.