మెగా వారసుడొస్తున్నాడట?

April 06, 2015 | 05:38 PM | 143 Views
ప్రింట్ కామెంట్
upasana_ramcharan_niharonline

విషయం అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. అవును ఈ మెగా ఫామిలీలోకి మరో బుజ్జి స్టార్ రాబోతున్నారట. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌ కు ఇది శుభవార్త. చిరంజీవిని తాతను చేస్తున్నాడు తనయుడు రాంచరణ్. ఉపాసన తల్లి కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉపాసన గర్భవతులకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చే రమోనా ఫిట్‌ నెస్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. అంతేకాకుండా తను చెకప్ ల కోసం హాస్పటల్ కు కూడా వెళుతోందని తెలుస్తోంది. ఈ విషయాలు తెలిసిన వారు మెగా ఫ్యామిలీలో మరో బుజ్జాయి రాబోతున్నాడని సమాచారం అందించారు. కన్ఫర్మేషన్ కోసం ఆ ఫామిలీ మెంబర్లు చెప్పే వారకూ వెయిట్ చేద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ