తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యాఖ్యల పరంపర ఈనాటిది కాదు. అది తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే పోటీకి సమ ఉజ్జీ ఉంటే కాస్త రసవత్తరంగా ఉంటుందేమో, కానీ ఇటీవల కాలంలో అది కూడా లేకుండా ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం.... ఎవరి మీద విమర్శలు చేస్తున్నాం అనే గీత కూడా దాటేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సరి కొత్త వివాదానికి తెర లేపింది. ‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే ఊహించుకోండి' అంటూ మైకు పట్టుకున్న కోతి బొమ్మను పోస్టు చేసాడు చెర్రీ. అయితే చరణ్ చేసిన ఈ ఫోటో కామెంట్ దర్శకరత్న దాసరినారాయణరావును టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ల తరువాత ఆ రేంజ్ పాపులారిటి ఉన్నది ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే నంటూ దాసరి వ్యాఖ్యానించడం... ఇక్కడ మెగాస్టార్ ను తక్కువ చేసినట్టే కదా అనుకుంటున్నారు. ఇక్కడ మేగా స్టార్ ను మాత్రమే టార్గెట్ చేసినట్టు ఉన్నా.... ఈ ఇరువురి తరువాత చాలా మంది సీనియర్ నటులే ఉన్నారు. ఇక్కడ క్రిష్ణ, శోభన్ బాబు లాంటి నటులు కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చీలిక తేవటానికి దాసరి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వినిపించాయి. అంతకు ముందు కూడా దాసరి ఓ సంచలన కామెంట్ చేశాడు. అది కూడా ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్న యువ నటుల గురించి. ఇక లాభం లేదనుకున్నాడేమో చరణ్ దాసరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఇలా పోస్ట్ చేశాడనే వార్తలు వినవస్తున్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా దాసరి నారాయణరావు వీరిని ఉద్దేశించినట్టు లేకపోయినా, రాంచరణ్ పంచ్ ఎవరికీ? అన్నట్టు ఉన్నా.... చూస్తున్న, వింటున్న ప్రజలకు మాత్రం అర్థమవుతూనే ఉంది.