ఇప్పటి వరకూ పోటీ అనేది లేకుండా మా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.. గత ఆరు సంవత్సరాల నుంచి ఈ అధ్య పదవిలో మురళీమోహన్ కొనసాగుతూ వచ్చారు. కొన్ని కారణాలు, పని వత్తిడి వల్ల ఈ పదవి నుంచి మురళీ మోహన్ తప్పకున్నారు.. దీంతో ఈసారి అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈయనకు నటులు నాగబాబు, శివాజీరాజా మద్ధతు పలుకుతున్నారు. అయితే నటి జయసుధ కూడా ఈ పోటీలో నిలబడడంతో పోటీ రసవత్తరంగా జరుగుతుందని ఫిల్మ్ నగర్ టాక్. నటి జయసుధ ఇప్పటికే ప్రభుత్వ ఎన్నికల్లో గెలిచి పదవులను చెపట్టింది. శుక్రవారం ‘మా’ లో నామినేషన్ వేశారు. మరి ఇలా హఠాత్తుగా జయసుధ ఎన్నికల్లో పోటీ లో నిలబడడానికి తన వెనుక పెద్ద హస్తాలే వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో గెలుపెవరిదో వేచి చూద్దాం.