థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ... అంటూ ఖడ్గం సినిమాలో ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ నిజానికి నిలదొక్కుకోవటానికి చాలానే కష్టపడ్డాడు. 90ల్లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎందులోనూ బ్రేక్ రాలేదు. చివరికి ఖడ్గం లో ఇచ్చిన ఆ ఒక్క డైలాగ్ కూడా అతని కెరీర్ ను మార్చలేకపోయింది. కానీ ఇప్పటికీ అతని కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఎమ్మెస్ నారాయణ మరణం, బ్రహ్మీ బోర్ కొడుతుండటంతో ప్రత్యామ్నాయం ఎవరున్నారు అనుకుంటున్న టైంలో భలే వచ్చాడు పృథ్వీ.
లౌక్యం చిత్రంలో సీరియల్ హీరో బాయిలింగ్ స్టార్ బబ్లూగా, చివర్లో బాలయ్య లెజెండ్ స్ఫూఫ్ తో కడుపుబ్బా నవ్వించిన పృథ్వీ ఇప్పుడు తెలుగు సినిమాకు హాట్ కేక్ గా మారిపోయాడు. ఇప్పుడొస్తున్న సినిమాలన్నింటిలో అతనే కీలకపాత్ర. ఈమధ్య రిలీజైన శంకరాభరణం సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయినప్పటికీ పర్సంటేజ్ పరమేశ్ గా పృథ్వీ నటన హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు బెంగాల్ టైగర్ లో ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా అలరించాడు పృథ్వీ. సినిమాలో బ్రహ్మీ, పోసాని వంటి వారు ఉన్నప్పటికీ అతని నటనే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఎంటర్ టైన్ గా ఉన్న ఫస్టాఫ్ లో పృథ్వీ నటనే హైలెట్. చూస్తుంటే పృథ్వీ పడ్డ థర్టీ ఇయర్స్ కష్టానికి ఫ్యూఛర్ స్టార్ కమెడియన్ గా నిలుస్తానడటంలో ఎలాంటి సందేహం లేదు.