బర్త్ డేను అమ్ముకుంటున్నారా?

August 21, 2015 | 02:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
chiranjeevi_birth_day_telecast_rights_niharonline

ఈసారి చిరంజీవి బర్త్ డేకు ఓ స్పెషాలిటీ ఉండడంతో చాలా రోజుల నుంచే ఆయన బర్త్ డే ప్లానింగ్ గురించి ప్రచారం బాగా ఊపందుకుంది.  ఆగస్ట్ 22న చిరంజీవి అరవయ్యో పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని అంగరంగవైభవంగా జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. అభిమానుల కోసం ఒక వేదిక సెలబ్రిటీల కోసం స్టార్ హోటల్ లో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ పలు చానళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చారు. చిరు బర్త్ డేని చాలా గ్రాండ్ గా చేసేందుకు చాలామంది సెలబ్రిటీలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన బర్త్ డే వేడుక చూసేందుకు సామాన్య జనం కూడా చాలా ఉత్సాహ పడుతున్నారు. అయితే ఈ వేడుకను చూసేందుకు లైవ్ ప్రోగ్రాం లాంటి ఏదీ లేదు. ఇలాంటి ప్రోగ్రాం ఉందంటే... ఎక్స్ క్లూజివ్ అంటూ ప్రోమోలు వేసి హడావిడి చేసేందుకు ఛానళ్లు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే వేడుకలని కూడా ఓ ఛానల్ లో ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారని వార్త. ఇలా వారికి మాత్రమే ఇస్తున్నారన్న మాట వాస్తవమైతే అది పెయిడ్ ప్రోగ్రాం అని అనుకోవాలి. అప్పుడు ఇటు మెగా ఫ్యామిలీకి ఆ ఛానల్ కి ఒప్పందం కుదిరినట్టే లెక్క. లేదా సాధారణంగా ఇలాంటి ప్రసార హక్కులను డబ్బులిచ్చి కొనుక్కుంటాయి ఛానల్స్. మరిప్పుడు అలాగే డబ్బులు తీసుకుని ఈ ఛానల్ కు రైట్స్ ఇచ్చారా? అంటే బర్త్ డే సెలబ్రేషన్స్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతుంది. ఇలా కాకుండా అన్ని ఛానల్స్ కి ప్రసారం చేసుకునే అవకాశం ఇస్తే బాగుండేదని అనుకుంటున్నారు జనాలు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ