కాజల్ కి పవన్ రికమండేషన్?

March 15, 2016 | 12:22 PM | 5 Views
ప్రింట్ కామెంట్
varun-tej-kajal-agarwal-srinu-vaitla-niharonline

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత గ్లామర్ ఒలకబోసినా పదేళ్లు హీరోయిన్ గా రాణించటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఏ యేడు కాయేడు పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ కాజల్ కి మాత్రం ఆఫర్లు ఏ మాత్రం తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు కాజల్ పని అయిపోయింది అనుకుంటున్న వారికి బడా బడా ఆఫర్లతో షాకిస్తూ వస్తోంది చందమామ. నిజానికి ఓ నాలుగేళ్ల క్రితం పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉండేది. చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. కానీ, కోలీవుడ్ లో వరుస భారీ సక్సెస్ లతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. విజయాలు ఆమె ఖాతాలో ఎక్కువ ఉండటమే ఇప్పుడు ఆఫర్లు రావటానికి కారణం. అందుకే కుర్రహీరోయిన్లు ఎందరు వచ్చినా పవన్, మహేష్ లాంటి వాళ్లు ఇప్పటికీ కాజల్ నే కొరుకుంటున్నారు. ఇక ఫస్ట్ టైం పవన్ తో సర్దార్ లో నటించబోతుంది కాజల్. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఈమెకు మరో మెగా ఆఫర్ తగిలిందట.

                                   వరుసఫ్లాపులతో ఉన్న దర్శకుడు శీనువైట్ల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయబోతున్నాడని తెలిసిందే. ఇందుకోసం రెజీనా, లావణ్య త్రిపాఠి లాంటి యువ హీరోయిన్లని పరిశీలనలో ఉంచాడు వైట్ల. అయితే ప్రస్తుతం ఈ జాబితాలో కాజల్ పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది.  హిట్ పర్సంటేజ్ తోపాటు సర్దార్ సెట్ లో కాజల్ డెడికేషన్ నచ్చి తనని తీసుకోవాల్సిందిగా స్వయంగా పవన్ వైట్లకు రికమండ్ చేశాడంట. దీంతో వరుణ్ సరసన కాజల్ దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అన్నట్లు కాజల్ వరుణ్ కన్నా వయసులో నాలుగేళ్లు పెద్దది లేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ