ఎన్నాళ్ళుగానో చిరంజీవి 150వ చిత్రం ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడనే విషయమై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయమై ఓ నిర్ణయానికొచ్చాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో చిరు కొత్త సినిమా వుంటుందనేది ఫిలింనగర్లో వినిపిస్తున్న టాక్ సారాంశం. ఐ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో శంకర్ కూడా తన తర్వాతి సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ర్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవలే ఐ మూవీ ఆడియో రిలీజింగ్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వచ్చిన శంకర్.. తన చిత్రాల్ని బాగా ఆదరించే తెలుగు ఆడియెన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, వారి కోసం వీలైతే ఓ డైరెక్ట్ తెలుగు సినిమాని తెరకెక్కించాలని వుందంటూ మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం. అందుకే ఐ రిలీజ్ తర్వాత శంకర్ వెళ్లి చిరుని కలుస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కథనాల్లో ఎంత మేరకు వాస్తవం వుందో తెలీదు. ఎందుకంటే ఇప్పటివరకు చిరుకి సంబంధించి బోలెడన్ని పుకార్లు షికార్లు చేశాయి. అసలు విషయం ఏంటో చిరు చెబితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.