చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి, తెరకు దూరమయ్యారు. ఈ సమయంలో ఆయన 150వ సినిమా తీయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంత వరకూ ఓ కొలిక్కి రానట్టు కనిపిస్తోంది. అయితే ఆయన ఈసారి జరుపుకోబోయే పుట్టిన రోజు వేడుక ఆయన 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ప్రత్యేక పుట్టిన రోజు. ఆగస్టు 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ చానల్ కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆదివారం ప్రసారం కానుంది (23 ఆగస్టు) ఈ టీవీ షోలో ఆయన తన ‘ఠాగూర్' సినిమాలోని ‘మన్మధ మన్మధ' సాంగుకు స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ టీవీ కార్యక్రమంలో సింగర్ మల్లికార్జున్ ఈ పాటకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన మల్లికార్జున్...తాను పెర్ఫార్మెన్స్ చేస్తూ చిరంజీవిని కూడా జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేయడం ఆయన లేచి కొన్ని స్టెప్స్ వేసి ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. చిరంజీవి స్టెప్పులేయడం మొదలు పెట్టాగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడియన్స్ లేచి చప్పట్లతో గట్టిగా ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారట. ఈ కార్యక్రమం ఆదివారం రానున్నట్టు తెలుస్తోంది.