చరణ్ అసలు – నా పాత్ర కొసరు

October 03, 2015 | 12:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Bruce-Lee-Movie-Audio-Release-chiranjeevi-speaking-niharonline

బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి తనయుడి సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తను కష్టపడ్డ విధానాన్ని మెచ్చుకుంటూ... బ్రూస్ లీ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. ఇది అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ - చరణ్ కేరక్టరైజేషన్ కారణంగానే.. శ్రీనువైట్ల - రామ్ చరణ్ ఈటైటిల్ ని ఎంచుకున్నారని అన్నారు చిరంజీవి.  డైరెక్టర్ శ్రీనువైట్ల, రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ లు, నిర్మాత దానయ్య, హీరో రామ్ చరణ్ లతో పాటు టెక్నీషియన్లు అంతా ఎంతో కష్టపడి పని చేయడంతో అక్టోబర్ 16 రిలీజ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమైందని అన్నారు చిరంజీవి.
"గత 15 రోజులుగా... రోజుకు 17-18 గంటలు కష్టపడుతున్నాడు చరణ్. అది చూసి ఎందుకు నాన్నా ఇంత కష్టపడుతున్నావ్. ఫైట్స్ డ్యాన్స్ లు అన్నీ ఒకసారే ఎందుకు అని అడిగింది వాళ్లమ్మ. అప్పుడు చరణ్ డాడీ కష్టం చూసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా అని అడిగాడు" అన్నారు చిరంజీవి.

తల్లి ప్రశ్నకి కొడుకు సమాధానం సూపర్ గా ఉంటే.. దీనికి తాను ఇంకో మంచి డైలాగ్ వేశానని చెప్పారు. ''డాడీ కష్టం చూస్తే మమ్మీకి పేమెంట్ గుర్తొస్తుంది.. అదే కొడుకు కష్టం చూస్తే తల్లికి పెయిన్ గుర్తొస్తుందంటూ..'' మంచి పంచ్ వేసి అందరినీ నవ్వించాడు.  ‘‘సినిమా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఉంటుందని.. నా ఎంట్రీ ఈ సినిమాలో కొసమెరుపు లాంటిదని చెప్పారు.  భోజనం చేశాక ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో.. తన రోల్ అంత స్వీట్ గా - థ్రిల్లింగ్ గా ఉంటుందన్నార. సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీను వైట్ల -  కోన వెంకట్ - గోపి మోహన్ కొరియోగ్రాఫర్లు జాని - శేఖర్ - లిరిసిస్టులతో పాటు.. హిట్ సంగీతం అందించిన థమన్ ను కూడా అభినందించారు. ''ఏదో చరణ్.. వైట్ల.. అయ్యప్ప దీక్ష తీసుకోవడం కాదు.. సినిమా యునిట్ అంతా ఒక దీక్షలాగా పనిచేస్తూ.. ఈ అవుట్ పుట్ ను అందిస్తున్నారు. నేను భరోసా ఇస్తున్నా ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది.. మిమ్మల్ని అలరిస్తుంది'' అని చెప్పుకొచ్చారు. 

చివర్లో150వ సినిమా గురించి మాట్లాడుతూ... ''కథ కోసం ఎదరుచూస్తున్నామని చెప్పట్లేదు.. పూర్తి స్థాయి 150వ సినిమా వచ్చేస్తోంది. త్వరలోనే చరణ్.. సురేఖ.. మీకు ఆ విషయాలను తెలియజేస్తారు. బ్రూస్ లీ రిలీజ్ కు కాస్త ముందు.. లేకపోతే ఒక 15 రోజుల్లో మీకు తెలుస్తుంది'' అని ముగించారు చిరంజీవి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ