చిరంజీవి 150 సినిమాపై పూరీ గారు కాస్త హర్టయ్యారన్నది వార్తల్లో వచ్చింది. మీడియా ముందు ‘పూరీ చెప్పిన కథ సెకండాఫ్ నచ్చ‘లేదని చిరంజీవి చెప్పడం ఈ డైరెక్టర్ ఈగో కాస్త దెబ్బతిన్నట్టుంది. సెకండాఫ్ నచ్చక పోతే మార్పులు చేసి మరోసారి వినిపించేవాడ్ని. ఆయన ఇలా నేరుగా మీడియాలో మాట్లాడ్డం చిరంజీవి ఫాన్స్ కు నచ్చలేదు. వారుం పూరీగారి మీద గరం గరం అయ్యారు. కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అందుకే పూరీ ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు మరో వ్యాఖ్య చేశారు. 150వ సినిమా చేయడానికి తనకే హక్కుందనీ, తాను చిరంజీవికి పెద్ద అభిమానిని అని, ఆయన తెర మీద ఎలా ఉంటే ఫాన్స్ మెచ్చుతారో అది తనకు బాగా తెలుసని... ఈ విషయం ఆయనకు కూడా తెలీదన్నారు. ఈకథ సరిగా లేక పోతే ఇంకో కథ చేస్తా.. అదీ కాక పోతే ఆయనకు నచ్చే వరకూ మార్చుతా. కానీ 150వ సినిమా మాత్రం తనదే... లేదంటే 151... అదీ కాకపోతే ఎప్పటికైనా చిరంజీవిగారితో సినిమా చేసి తీరుతానని తన అభిమానాన్ని చాటుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు కానీ... ఈ జబర్దస్తీ అభిమానం ఏంటి పూరీగారూ...?