పద్మవి భూషణ్ ఉన్నతమైన పౌర పురస్కారం అందుకున్న చిరంజీవి సల్మాన్‌ఖాన్‌ను సమర్థించడం తప్పంటోంది పౌరజమాపం తోటి నటులు సమస్యల్లో ఉన్నప్పుడు పరామర్శించడం సమర్థించడం పరిపాటే. కానీ సల్మాన్ నేరం తీవ్రమైనది కోర్టు పరిగణించడం, ఐదేళ్ళ జైలు శిక్షకు అర్హునిగా శిక్ష విధించిన ఆయనకు ఎంపీ స్థాయిలో ఉన్న చిరంజీవి మద్దతు నివ్వడం వివాదం అయ్యింది. ముంబై సెషన్స్ కోర్టులో శిక్షపడిన వ్యక్తి గురించి పైకోర్టుకి వెళ్లి బెయిల్ తీసుకోవచ్చు, అలాగే ఈ తీర్పుని కూడా అక్కడే సవాల్ చేసుకోవచ్చు అంటూ చిరంజీవి అనడం తప్పంటున్నారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా చిరంజీవి సల్మాన్‌ఖాన్‌కు వత్తాసు పలకడం మంచిది కాదని కొందరు ప్రముఖులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైట్లలో చిరంజీవికి వ్యతిరేకంగా దుమారం లేపారు. గతంలో చిరంజీవి ఇలాంటి విషయాల్లో మౌనం వహించారనీ, కానీ ఈసారి మాత్రం ఇలా మాట్లాడి తప్పు చేశారంటున్నారు. వ్యక్తిగా పరిచయాలు వేరు, మద్దతు పలకడాలు వేరని అంటున్నారు. గతంలో తన బిజినెస్ పార్టనర్ నిమ్మగడ్డ ప్రసాద్ నేరారోపణలు ఎదుర్కొని జైలులో వున్నప్పుడు కూడా ఆయనేమీ ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదంటున్నరు. ఇలాంటి విషయాల్లో ఎందరు ఎలా ఉన్నా, ఆయన ఎప్పుడూ మాట్లాడలేదనీ, కానీ సల్మాన్ విషయంలో ఎందుకు ఎలా ప్రకటన చేశారని అనుకుంటున్నారు.