‘టర్బో మెగా ఎయిర్వేస్’ ప్రైవేటు లిమిటెడ్ ‘ట్రుజెట్’’’ పేరుతో రాంచరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఎంటరైన విషయం అందరికీ తెలిసిందే. తన మిత్రుడు ఉమేష్‌తో కలిసి ఈ సంస్థను రాంచరణ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఇంతకు ముందే వార్తల్లో వచ్చింది. ఈ విషయాన్ని రాంచరణ్ కూడా ఓ చానల్ ప్రోగ్రామ్ లో తెలిపాడు. ఈ సంస్థ 2013 చివర్లోనే రిజిస్టర్ అయ్యింది.జూన్ లో టర్బో మెగా ఎయిర్వేస్ బిజినెస్ ప్రారంభం అవుతున్నట్టు సీఈఓ ఉమేష్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన లోగో ఒకటి సోషల్ మీడియాలో వెలువడింది. తమ సంస్థకు సంబంధించిన లోగో డిజైన్ తయారవుతున్నట్టు ఇతర బ్రాండింగ్ వర్క్ నడుస్తోందని రామ్ చరణ్ ఆ మధ్య తెలిపారు. తాజాగా ‘ట్రుజెట్’ పేరుతో లోగో ఒకటి బయటకు వచ్చింది. ఇదే కన్ఫం చేశారా? మరేదైనా లోగో ఉందా అనేది తెలియాల్సి ఉంది.