ఎంత ఎదిగినా ఒదిగుండడమనేది...ఇంకా ఎదగడానికి మార్గం సుగమమవుతుంది అనే విషయం కొంత మందికి అనుభవంతో తెలిస్తే, మరికొందరికి పెద్ద వాళ్ళు క్లాస్ పీకితేగానీ తెలియదేమో... శ్రీను వైట్లకు తన సక్సెస్ అంతా తన చేతుల్లోనే ఉందన్న గర్వమేమో... ఎవరికీ తలవంచను...అన్నట్టు ఎవరైనా నచ్చక పోతే ముఖం మీదే ఏదో ఓ మాట అనేయడం ఆయనకు బాగా అలవాటట. ముక్కుసూటిగా వెళ్ళడమే కాదు, హర్ట్ అయ్యేలా ఓ మాట అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా.... ఇలాంటి నేచర్ ఉన్న వారికి శత్రువులు పెరిగిపోతూనే ఉంటారు. ఆ విధంగానే కోన వెంకట్, గోపీ మోహన్, ప్రకాష్‌రాజ్ లాంటి సినీ ప్రముఖులు వైట్లకు దూరమయ్యారు. మరి ఇప్పుడలా లేడని శ్రీను వైట్ల గురించి ఇండస్ట్రీలో చాలా మాట్లాడేసుకుంటున్నారు. అందరితోనూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట. దీనికి కారణమేంటని కూడా పరిశ్రమలోనే అన్సర్ కూడా చెప్పేసుకుంటున్నారు. చరణ్‌తో సినిమా చేసే నేపథ్యంలో చిరంజీవితో చాలా సార్లు మాట్లాడాడట శ్రీనువైట్ల. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వైట్లకి ఇండస్ట్రీలో మనగలగాలంటే శత్రువు ఉండకూడదనీ, సర్దుకుపోయే మనస్థత్వం కలిగి ఉండాలని చిరంజీవి క్లాస్ పీకినట్టు అనుకుంటున్నారంతా. చిరంజీవి ఇన్నేళ్ళ తన అనుభవాలను కూడా ఆయనకు చెప్పారట. దీంతో కీచులాటలు మాని అందరితో శ్రీనువైట్ల కలిసిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదండీ సంగతి.