టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సామాజిక సందేశం నేపథ్యంతో వచ్చిన చిత్రాల్లో హిట్స్ కన్నా ఫెయిల్యూర్సే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ టైంలో కూడా వారు చేసిన సందేశాత్మక చిత్రాలు కొన్ని జనాదరణ నొచుకోలేదు. ఇక ఈ తరం హీరోలలో సీనియర్లు దగ్గరి నుంచి యూత్ వరకు కొన్ని మేసేజ్ ఓరియెంటల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే పాత తరంలోలాగానే వీటిల్లో కూడా ఫెయిల్యూర్ పర్సంటేజే ఎక్కువే. మాస్ జనాల్లో ఎక్కువగా ఉన్న ఆదరణతో వారు అలాంటి ప్రయోగాలు చేసినప్పుడల్లా అట్టర్ ఫ్లాప్ నే చవిచూస్తున్నారు. అభినందనల మాట పక్కన పెడితే మాగ్జిమమ్ జనాల దగ్గరి నుంచి విముఖతే ఎదురవుతోంది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రస్థానంలో పోటీపడుతున్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకడు. గతంలో సైనికుడు అనే ఓ చిత్రం ఇదే తరహాలో తీసి భంగపడ్డాడు. పోకిరి లాంటి మాస్ హిట్ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవటంతోపాటు మరో ఐదేళ్లదాకా మహేష్ కు హిట్ అనేది లేకుండా చేసింది. దీంతో మహేష్ ఇంకెప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న చిత్రాల జోలికి పోకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ, ఇప్పుడు శ్రీమంతుడు ఇచ్చిన ఫలితంతో మళ్లీ అలాంటి ప్రయోగానికే సిద్ధమైపోతున్నాడు. మురగదాస్ దర్శకత్వంలో తీయబోయేది కంప్లీట్ సామాజిక సందేశం ఉన్న చిత్రమేనట. మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం న్యాయవ్యవస్థలోని లోసుగుల ఆధారంగా కథ ఉండబోతుందట. ఠాగూర్ లాగా ఇది కూడా పవర్ ఫుల్ కథాంశంతో ఉండబోతుందని ఇటీవలె మురగదాస్ హింట్ ఇచ్చాడు కూడా. తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రానికి చట్టంతో పోరాటం అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. ఇది చిరంజీవి పాత సినిమా టైటిల్. 1985లో వచ్చిన ఈ సినిమా చిరూ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హిట్ టైటిల్ కావటం, పైగా కథకి సరిపోయేలా ఉండటంతో ఇది అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే సందేశాత్మక చిత్రం అనటంతోనే మహేష్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.