మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా, హఠాత్తుగా అనుకోని బ్రేక్ పడింది. భుజానికి గాయం కావటం, అందుకోసం ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చిరు శస్త్ర చికిత్స చేయించుకోవటం తెలిసిందే. మొన్నామధ్య ఓ రాజకీయ అంశంపై రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో చేతికట్టుతోనే కనిపించిన చిరు ఆ తర్వాత తన కూతురి పసుపు దంచే కార్యక్రమంలో కూడా కట్టుతోనే కనిపించాడు. ఇక ఇప్పుడు అదే చేతికట్టుతోనే ఓ జిమ్ లో సందడి చేశారు.
ఇదేదో ఆయన శరీరాకృతి కోసం చేస్తుంది కాదులేండి. ఆయన పర్సనల్ జిమ్ ట్రైనర్ గా ఉన్న ప్రవీణ్ రెడ్డి మణికొండ ప్రాంతంలో 'రాగాస్ ప్లెక్స్' పేరిట వ్యాయామశాలను ఏర్పాటు చేయగా దాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఆపై అక్కడి వ్యాయమ పరికరాలను పరిశీలిస్తూ, కాసేపు కసరత్తులు చేశారు. అత్యాధునిక ప్రమాణాలతో మోడ్రన్ జిమ్ ను నెలకొల్పాడని ప్రవీణ్ ను చిరంజీవి అభినందించారు. చేతికి కట్టుతోనే ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కట్టేదో త్వరగా తొలగిపోయి, 150వ చిత్రం మొదలైపోతే అభిమానులకు అంతకన్నా ఏం కావాలి.