'చిత్రమ్ కాదు నిజమ్` అంటున్న గుడ్ సినిమా గ్రూప్

March 16, 2015 | 02:36 PM | 48 Views
ప్రింట్ కామెంట్
chitram_kadu_nijam_movie_niharonline

2010లో ఆరుగురు ఫ్రెండ్స్ సరదాగా ట్రక్కింగ్ చేయడానికి మంగుళూరు కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అడవిలోకి వెళ్లి, కనిపించకుండా పోయారు. అప్పుడు వాళ్లు తీసుకెళ్లిన కెమెరా 2012లో దొరకగా అందులోని విజువల్స్ లో వాళ్లు ఏ విధంగా కనపడకుండా పోయారో తెలిసింది. ఇప్పుడు ఆ విజువల్స్ ని సినిమా రూపంలో ఎడిటింగ్ చేసి, యథావిధిగా, అటవీశాఖ అనుమతితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది వినడానికి వింతగా ఉన్నా...చిత్ర పరిశ్రమలోనే ఓ అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఈ డిఫరెంట్ సినిమాకు 'చిత్రమ్ కాదు నిజమ్' అనే టైటిల్ పెట్టారు. ఈరోజుల్లో, రొమాన్స్, విల్లా, భద్రమ్ వంటి విజయవంతమైన వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంధ్ర ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించింది. రమేష్ ఈ ఫుటేజ్ ని షూట్ చేశారు.అన్ని కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, మార్చి 28 న విడుద‌లవుతుంది.ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత‌లు గుడ్‌ఫ్రెండ్స్ మాట్లాడుతూ " ఓ అరుదైన సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంగుళూరుకు సమీపంలోని ఫారెస్ట్ లో ఆరుగురు ఫ్రెండ్స్ కనిపించకుండా పోయిన సంఘటనల సమాహారమే 'చిత్రమ్ కాదు నిజమ్'. వాళ్లు కనిపించకుండా పోయినా...వారికి సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. అందులోని విజువల్సే చిత్రమ్ కాదు నిజమ్. అంటే ఏ ట్రూ ఫుటేజ్ ఫిల్మ్. అటవీశాఖ అనుమతి తీసుకొని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈరోజుల్లో, రొమాన్స్, భద్రమ్, విల్లా వంటి వైవిధ్యమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్...' చిత్రమ్ కాదు నిజమ్' వంటి అద్భుతమైన సినిమా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నాం. మార్చి 28న‌ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని అన్నారు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ