సిద్ధార్థ్, దీప సన్నిధి హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం 'ఎనకుల్ ఒరువన్'. ప్రసాద్ రమర్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా తమిళనాట మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈ చిత్రాన్ని కోనేరు కల్పన సారథ్యంలో కల్పన చిత్ర బ్యానర్ పై ప్రకృతి నిర్మాతగా తెలుగులో 'నాలో ఒకడు' అనే టైటిల్ తో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.