తెలంగాణ పుణ్యక్షేత్రం అయిన యాదగిరి గుట్ట అభివ్రుద్ధి కోసం సీఎం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పుణ్యక్షేత్రాన్ని రీ మోడలింగ్ చేయడం కోసం ఆయన ఓ సినీ కళా దర్శకుడినే నియమించుకున్నారు. ఆయన ఎవరో కాదు పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి. ఇప్పటికే గుట్ట డిజైన్ ను సీ.ఎం చూపించారట. ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టు కూడా తెలుస్తోంది. ఈ బాధ్యతల్ని సీఎం తనకు అప్పగించడం వెనుక వున్న విషయాన్ని ఆయన వివరించాడు. ఈ అవకాశం చిన జీయర్ స్వామి వల్ల వచ్చిందట. ఆయనతో కలిసి శంషాబాద్ పరిసరాల్లోని రామానుజాచార్యులు ప్రాజెక్టుకు పని చేశాననీ, అదే ఈ అవకాశం తెచ్చి పెట్టిందని అన్నారు. ఎన్ని సినిమాలకు పని చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ప్రాజెక్టుతో వస్తోందని చాలా ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తనకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అని అన్నారు. షాపులు, హోటళ్ళు, లాడ్జింగ్ వంటి సదుపాయాలతో కలిపి ఈ ప్రత్యేకమైన డిజైన్ రూపొందిందని అన్నారు. ఈయన పవన్ కళ్యాన్ తొలిప్రేమ చిత్రం కోసం తాజ్ మహల్ సెట్ వేసి అభినందనలు అందుకున్నాడు. బన్నీ భద్రీనాథ్ సినిమాకు కూడా సెట్ వేసింది కూడా ఈయనే. ఇంత ఆర్ట్ ఆయనలో ఉంది కాబట్టే ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడన్న మాట.