టాలెంట్ లేకపోతే తుస్సే

December 15, 2014 | 05:07 PM | 103 Views
ప్రింట్ కామెంట్

తమ కుటుంబంలో ఎవరో ఒకరి అండదండలు ఉంటే చాలు హ్యాపీగా సినీ పరిశ్రమలో దూరేసి హీరోలై పోతున్నారు సినీ వారసులు. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పైత్యం పరాకాష్టకు చేరుకుంది. అయితే ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే వారి పని అంతే అన్నది అక్షర సత్యం. అది వారి కెరీర్ ప్రారంభానికే తప్ప ఎదుగుదలకు ఎందుకూ పనిరాదని కొందరు అల్రెడీ ప్రూఫ్ చేశారు కూడా. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎంతో మంది వారసులు వచ్చినప్పటికీ వారిలో కొందరే నిజమైన నట వారసులుగా నిరూపించుకోగలిగారు. నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే ఇలాంటి వారసులలో ఒకరు తమ టాలెంట్ తో పైకొస్తే మరికొందరు నిలదొక్కుకొలేక అధో:పాతాళానికి పడిపోతున్నారు. అలాంటివారిలో కొందరు ఈ జనరేషన్ బ్రదర్స్ పై ఓ లుక్కేద్దాం. ఈ వరుసలో చెప్పుకొదగింది ముందుగా నందమూరి ఫ్యామిలీ. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయులలో చెప్పుకొదగింది నటసింహం బాలక్రుష్ణ. ఇక బాలయ్య తర్వాత నటనతోపాటు గాంభీర్యం, హవభావాలను పలికించగలిగే ఏకైక వారసుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అయితే ఇలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి జూనియర్ తోపాటు ఒకే టైంలో కెరీర్ ప్రారంభించిన మరో వారసుడు తారక్. రికార్డుస్థాయిలో ఒకేసారి 11 చిత్రాల షూటింగ్ ను ఒకేసారి ప్రారంభించాడు. అయితే మనోడి టాలెంట్ జనాల్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో ఆయా చిత్రాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలీదు.మరో సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా కంటే నిర్మాతగా ఎక్కువ సక్సెస్ రేటులో ఉన్నాడు. ఇక మరో బ్రదర్స్ అల్లు వారబ్బాయిలు. కేవలం మెగాస్టార్ అశీస్సులే తప్ప తన స్వయంక్రుషితోనే అల్లు అర్జున్ టాప్ హీరోగా ఎదిగాడు. తండ్రి బడా నిర్మాత అయిన ఎక్కడా ఆ గర్వం కనపడకుండా తన సొంత టాటెంట్ తో సక్సెస్ లు కొడుతు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఇక మరో అల్లు హీరో శిరీష్ ది దీనికి వ్యతిరేకంగా. గౌరవం లాంటి సామాజికి స్ప్రుహ నేపథ్యం ఉన్న కథాచిత్రంతో కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది కాస్తా బోల్తా పడింది. తర్వాత కొత్తజంట చిత్రంతో ముందుకు వచ్చిన సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇక హీరోలుగా చేసిన ప్రయత్నాలు విఫలమయి నిర్మాతలుగా సెటిలయిన బ్రదర్స్ లిస్ట్ కూడా ఉంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకొదగింది ఘంటమనేని బ్రదర్స్ గురించి. నటశేఖర కృష్ణ వారసుడిగా తెరంగ్రేటం చేసిన రమేష్ బాబు హీరోగా మెప్పించటంలో దారుణంగా విఫలమయ్యాడు. ఓ అరడజను చిత్రాలు హీరోగా చేసినప్పటికీ లాభం లేకపోవటంతో చివరికి నిర్మాతగా సెటిలయిపోయాడు. ఇక ప్రారంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి, హీరోగా ఎదిగిన మహేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ ప్రారంభంలో ఫ్లాప్ లు పలకరించినప్పటికీ రానూరానూ తన నటనైపుణ్యాన్ని పెంచుకొని విపరీతమైన క్రేజ్ ను ఏర్పరుచుకొని తెలుగు కాదు కాదు... సౌత్ కాదు కాదు... ఏకంగా జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు సంపాదించుకుని అగ్రహీరోగా సెటిలయ్యాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ